ఏపీలో కరోనా పరీక్షలకు అనుమతి

by సూర్య | Fri, Mar 27, 2020, 01:35 PM

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరింది. శుక్రవారం మధ్యాహ్నాం ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో మరొక కరోనా కేసు నమోదయినట్టు తెలిపింది. విశాఖకు చెందిన కరోనా పాజిటివ్ రోగి బంధువుకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యశాఖ వెల్లడించింది. విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 26,590 మంది వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపింది. 25,942 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచామని, కరోనా అనుమానిత లక్షణాలతో ఉన్న 117 మందికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.ఏపీలో కరోనా పరీక్షలు చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుమతిచ్చింది. విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీ, కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతిచ్చింది. అదే విధంగా ఏపీలోని 13 ప్రైవేటు మెడికల్ కాలేజీలను జిల్లా ప్రత్యేక కరోనా ఆస్పత్రులుగా మారుస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Latest News

 
కరవదిలో నాగసత్యలత, చందన ఎన్నికల ప్రచారం Sat, Apr 20, 2024, 12:21 PM
వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శం: బాలినేని Sat, Apr 20, 2024, 12:20 PM
25న కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ Sat, Apr 20, 2024, 12:17 PM
దద్దాల సతీమణి ఎన్నికల ప్రచారం Sat, Apr 20, 2024, 12:15 PM
టిడిపిని వీడి 35 కుటుంబాలు వైసీపీలోకి చేరిక Sat, Apr 20, 2024, 12:13 PM