కరోనాపై ఐక్య పోరుకు సిద్ధమైన జి-20 దేశాలు

by సూర్య | Fri, Mar 27, 2020, 12:53 PM

సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ అధ్యక్షతన గురువారం జరిగిన జి-20 దేశాల అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, భారత ప్రధాని మోదీ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ పై ఐక్యంగా పోరు సాగించాలని జి-20 దేశాల కూటమి ప్రతినబూనింది. ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సుమారు 3 లక్షల కోట్ల డాలర్లను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించాలని నిర్ణయించింది. కాగా ఐక్యపోరుకు తామంతా కట్టుబడి ఉన్నామని నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న దృష్ట్యా ఆర్థిక లక్ష్యాలను కాకుండా మానవాళి వికాసాన్ని ప్రపంచాభివృద్ధికి కేంద్రంగా చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. వైద్య పరిశోధనల ఫలాలు ఉచితంగా అన్ని దేశాలకూ అందాలని అభిప్రాయపడ్డారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM