ఐసోలేషన్ వార్డులు'గా సెకెండ్ ఏసీ రైలు పెట్టెలు

by సూర్య | Fri, Mar 27, 2020, 12:56 PM

దేశంలో కరోనా వైరస్ అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో దేశంలో రైల్వే వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కేసులు మరింతగా పెరిగిపోయి, ఒక వేళ ఆసుపత్రుల్లో పడకలు సరిపోకపోతే రైళ్లలోని సెకెండ్ ఏసీ పెట్టెలను సంచార ఆసుపత్రులుగా వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలన్నీ రద్దు అయి పెట్టెలన్నీ ఖాళీగా పడి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. రోగుల్ని, కరోనా సోకినట్లు అనుమానం ఉన్నవారిని ఎవరితోనూ కలవనీయకుండా ఉంచేందుకు 'ఐసోలేషన్ వార్డులు'గా సెకెండ్ ఏసీ రైలు పెట్టెల్ని వాడుకోవాలని భావిస్తున్నారు. సెకెండ్ ఏసీ పెట్టెల్లో కొద్ది పాటి మార్పులు చేసి, వెంటిలేటర్లు సహా వైద్య పరికరాలను అమర్చుకుంటే అవి సంచార ఆసుపత్రులుగా మారిపోతాయని భావిస్తున్నారు.

Latest News

 
ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్.. కీలక నేత గుడ్‌ బై.. రేపో మాపో సొంతగూటికి! Fri, Mar 29, 2024, 07:26 PM
బూడిద ఇచ్చే 'బూడి' కావాలా.. అభివృద్ధి ఇచ్చే మోదీ కావాలా?.. సీఎం రమేష్ Fri, Mar 29, 2024, 07:23 PM
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM