ఇండియన్స్‌‌కు గుడ్ న్యూస్ అందించిన తాజా అధ్యయనం

by సూర్య | Thu, Mar 26, 2020, 02:35 PM

ఎవర్ని మందలించినా కరోనా వైరస్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ మేరకు దేశం మొత్తం లాక్‌డౌన్ కావడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితిలో ఇంట్లోనే ఉంటూ ఉదయం నుంచి రాత్రి వరకు ఈ వైరస్ గురించి మాట్లాడుకుంటున్నారు.ఈ మేరకు దేశంలో ఇప్పటికే 12 మంది మృతి చెందగా, 664 మంది వ్యాధితో బాధపడుతున్నారు. అయితే.. రానున్న రోజుల్లో ఈ వ్యాధి మరింత ఎక్కువ మందికి సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని, పరిశుభ్రత పాటిస్తూ ఉండాలని చెబుతున్నారు.దాదాపు 5 లక్షల మంది ఈ వైరస్ బారిన పడతారని అంటున్నారు. అయితే, తాజా అధ్యయనం ఇండియన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. వేడి, తేమ తక్కువగా ఉన్న వాతావరణం కరోనా వ్యాప్తిని అడ్డుకుంటుందని పేర్కొంది.అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కరోనా బాధితులపై చేసిన అధ్యయనంలో ఈ నిజం తెలిసిందట.ఈ సందర్భంగా ఉష్ణోగ్రత, గాలిలోని తేమను పరిశీలించి కరోనా వైరస్ తీరును శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అందులో కరోనా వేగంగా వ్యాప్తి చెందిన దేశాల్లో ఉష్ణోగ్రత 3 నుంచి 17 డిగ్రీల మధ్యే ఉందట. 90 శాతం కేసుల్లో ఉష్ణోగ్రత, తేమ ప్రభావం చూపాయట.ఈ మేరకు ఇండియా, బ్రెజిల్, మలేసియా, అమెరికాలోని ఫ్లొరిడా, లూసియానా, రాష్ట్రాల్లో కొత్త కేసులు తక్కువగా ఉండటానికి కారణం అదేనని వెల్లడించారు పరిశోధకులు. గాలిలో తేమ ఎక్కువగా ఉండి.. చల్లని వాతావరణాన్ని కలిగిన వుహాన్, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని స్పష్టం చేశారు. ఉష్ణోగ్రత ఒక్కటే కరోనా వ్యాప్తిని అడ్డుకోలేదని.. తేమ ప్రధాన పాత్ర వహిస్తుందని వివరించారు.అనంతరం జనవరి 22 నుంచి మార్చి 21 మధ్య 10 రోజుల చొప్పున కేసుల వివరాలను పరిశీలించగా.. 4 డిగ్రీల నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత, 3 నుంచి 9 జీ/ఎమ్3 తేమ ఉన్న ప్రాంతాల్లోనే వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు తెలిపారు.భారత్‌లో ప్రస్తుతం ఉన్న కేసుల సంఖ్య తక్కువేనని, దీనికి ప్రధాన కారణం దేశంలో 18 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండటమేనని వెల్లడించారు. దీన్ని బట్టి రాబోయేది వేసవి కాలం కాబట్టి.. కరోనా వైరస్ వ్యాప్తి ఇండియాలో తక్కువగానే ఉంటుందని అంచనాకు రావొచ్చని తేల్చి చెప్పారు.

Latest News

 
పోలీసుల సమక్షంలోనే కొట్టారు... మంత్రి జోగి రమేష్ Mon, May 13, 2024, 09:16 PM
రేపు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్,,,,పవన్ కల్యాణ్ కు ఆహ్వానం Mon, May 13, 2024, 09:15 PM
గ్లాసు గుర్తుకు ఓటు వేయమంటే, ఫ్యాన్ గుర్తుకు వేశారు.. 'నా ఓటు నాకు కావాల్సిందే'.. ఓటరు గొడవ Mon, May 13, 2024, 08:59 PM
బౌన్సర్లతో వచ్చిన టీడీపీ అభ్యర్థి.. వైసీపీ అభ్యంతరం, హై టెన్షన్ Mon, May 13, 2024, 07:45 PM
కదం తొక్కిన ఏపీ ఓటర్లు.. రికార్డు స్థాయిలో పోలింగ్ Mon, May 13, 2024, 07:41 PM