కరోనా ఎఫెక్ట్..విద్యుత్ సంస్థల కీలక నిర్ణయం

by సూర్య | Thu, Mar 26, 2020, 02:07 PM

కరోనా వైరస్ ప్రభావంతో ఏపీ విద్యుత్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి నెల కరెంట్ బిల్లును మీటర్ రీడింగ్ ద్వారా కొట్టేవారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి నెల బిల్లును యావరేజ్ బిల్లుగా పరిగణించాలని నిర్ణయించారు. అంటే మార్చి నెల బిల్లును ఏప్రిల్ 1 నుంచి ఇంటింటికి తిరిగి రీడింగ్ ను కొట్టాలి. వచ్చిన బిల్లును సిబ్బంది ఇంట్లో ఇచ్చేవారు. బిల్లులను ఆన్ లైన్ లో లేదా గ్రామంలో ఉన్న విద్యుత్ సిబ్బందికి చెల్లించేవారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఇంటికి విద్యుత్ సిబ్బంది తిరిగే పరిస్థితులు లేవు. దీంతో గత 3 నెలల బిల్లును సగటు విద్యుత్ వినియోగంగా తీసుకొని మార్చి నెల బిల్లుగా పరిగణించనున్నారు. ఆన్ లైన్ లో బిల్లు వివరాలను పొందుపరుచనున్నారు. వినియోగదారులు కూడా ఆన్ లైన్ ద్వారానే బిల్లును చెల్లించాలని విద్యుత్ సంస్థలు సూచించాయి. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా స్పాట్ బిల్లింగ్ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆన్ లైన్ లో బిల్లు చెల్లించలేని పేదలకు బిల్లు చెల్లింపుకు గడువు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Latest News

 
బీసీలకి న్యాయం చేసింది సీఎం జగన్ మాత్రమే Fri, Apr 26, 2024, 02:12 PM
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM