ఏటీఎంకు వెళ్లలేనివారికి ఇంటికే డబ్బులు...!

by సూర్య | Wed, Mar 25, 2020, 05:35 PM

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా డబ్బుల్ని ఇంటికి పంపించే ఏర్పాటు బ్యాంకులు చేస్తున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులు కస్టమర్లకు డబ్బుల్ని ఇంటికే పంపిస్తున్నాయి. అత్యవసరంగా డబ్బులు కావాల్సి వస్తే బ్యాంకును సంప్రదించొచ్చు. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్ అయితే డోర్‌స్టెప్ డెలివరీ సర్వీసెస్‌ని ఉపయోగించుకోవచ్చు. ఎమర్జెన్సీ సమయంలో ఏ కస్టమర్ అయినా ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. రూ.100 ఛార్జీ చెల్లించాలి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా ఇలాంటి సేవల్నే అందిస్తోంది. అయితే రూ.5000 నుంచి రూ.25000 మధ్య మాత్రమే క్యాష్ అందిస్తుంది. ఇందుకు రూ.100 నుంచి రూ.200 మధ్య ఛార్జీలు చెల్లించాలి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు క్యాష్ ఆర్డర్ చేయొచ్చు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM