కరోనా పై మరిన్ని కీలక నిర్ణయాలు

by సూర్య | Wed, Mar 25, 2020, 05:02 PM

ఏపీ సీఎం జగన్ కరోనా,లాక్ డౌన్ పరిస్థితుల పై బుధవారం అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను సీఎస్ నీలం సాహ్ని వెల్లడించారు. సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివి
- నిత్యావసర దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంటల వరకు తెరిచి ఉంటాయి. కూరగాయలు, పాల విక్రయ కేంద్రాలు, రైతు బజార్లు తెరచి ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు తెరిచి ఉంటాయి.
- మెడికల్ షాప్ లు రోజంతా అందుబాటులో ఉంటాయి.
- రైతుబజార్ల వద్దకు ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. కావున దీనిని నివారించేందుకు 2నుంచి 3 కిలో మీటర్ల దూరంలో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ రైతు బజార్ల ఏర్పాటు.
- సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు జనసంచారం పై పూర్తి నిషేధం.
-నిత్యావసరాల కొరత, లాక్ డౌన్ పై ఫిర్యాదులకు 1902 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు.
- కరోనా వైద్య సంబంధ ఫిర్యాదులు, విదేశీయుల సమాచారం అందించేందుకు 104 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM