బ్యాంకు సమయాల్లో మార్పు..!

by సూర్య | Wed, Mar 25, 2020, 05:52 PM

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మార్చి 24న దేశం మొత్తం లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఇది 21 రోజుల పాటు కొనసాగుతుంది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ 21 రోజుల్లో ఏ ఏ సర్వీసులు అందుబాటులో ఉంటాయో తెలియజేస్తూ హోం శాఖ నిబంధనలను జారీ చేసింది. లాక్‌డౌన్ సమయంలో అవసరమైన అత్యవసర సేవలు అందుబాటులోనే ఉంటాయని మోడీ తెలిపారు. మోదీ లాక్‌డౌన్ ప్రకటించిన వెంటనే చాలా మందిలో బ్యాంకులు ఉంటాయా? ఉండవా? ఏటీఎంలు పనిచేస్తాయా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఆ తర్వాత అన్ని అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టతనిచ్చారు. బ్యాంకులను కూడా అత్యవసర సేవల కిందనే చెప్పుకోవచ్చు. అందువల్ల బ్యాంకులు పని చేస్తాయి. ఇంకా వాటర్ సప్లై, శానిటైజేషన్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. అందువల్ల బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందకుండా బ్యాంకుకు వెళ్లి అవసరమైన సర్వీసులు పొందొచ్చు. 21 రోజుల లాక్‌డౌన్ పీరియడ్‌లో కూడా ఏటీఎంలు పనిచేస్తాయి. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం పని గంటలను తగ్గించేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అందుబాటులో ఉంటాయి. ఇకపోతే బ్యాంకులు కేవలం ఎస్సెన్షియల్ సర్వీసులను మాత్రమే ఆపర్ చేస్తున్నాయి. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంక్ ఏటీఎం ట్రాన్సాక్షన్లపై చార్జీలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. మూడు నెలలు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM