వైఫై స్పీడ్‌ని పెంచాలంటే..ఈ 9 టిప్స్...

by సూర్య | Wed, Mar 25, 2020, 02:23 PM

కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో అనేక కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. చాలామంది ఉద్యోగులు వైఫై పైన ఆధారపడుతున్నారు. అయితే మంచి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఉన్నా సరే వైఫై సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. మీరూ అదే సమస్య ఎదుర్కొంటున్నారా? మరి వైఫై స్పీడ్ పెంచడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ముందుగా వైఫై అవసరం లేని డివైజ్‌లు ఏవైనా ఉంటే మీ రౌటర్ నుంచి డిస్‌కనెక్ట్ చేయండి.
2. మీ రౌటర్ ఎక్కడ పెట్టారు అన్నది కూడా ముఖ్యమే. ఎలక్ట్రికల్ పరికరాలకు, గోడలకు కాస్త దూరంగా వైఫై ఏర్పాటు చేయండి.
3. వేర్వేరు ఎస్ఎస్ఐడీలను క్రియేట్ చేయండి. ఏ డివైజ్‌కు ఎంత స్పీడ్, డేటా కేటాయించాలో అంతే సెట్ చేయండి.
4. మీ వర్క్ డివైజ్‌కు ఫ్రీక్వెన్సీ వేరుగా ఉంచండి. ఆ ఫ్రీక్వెన్సీకి ఇతర డివైజ్‌లను కనెక్ట్ చేయొద్దు.
5. మీరు రౌటర్‌కు దగ్గర పనిచేస్తున్నట్టైతే లాన్ కేబుల్‌ ఉపయోగించాలి. వైర్‌లెస్ కనెక్షన్ కన్నా, ల్యాన్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ.
6. మీ డ్యుయెల్ బ్యాండ్ రౌటర్‌లో 2.4GHz కన్నా 5GHz ఫ్రీక్వెన్సీని ఉపయోగించండి. 5GHz ఫ్రీక్వెన్సీతో ఎక్కువ స్పీడ్‌ ఉంటుంది.
7. ఒకవేళ మీ వర్క్ డివైజ్‌కు రౌటర్‌కు మధ్య 10 అడుగుల దూరం ఉంటే 2.4GHz ఫ్రీక్వెన్సీ ఎంచుకోండి. దీని వల్ల సిగ్నల్ స్ట్రెంత్ బాగుంటుంది.
8. వైఫై డెడ్ జోన్స్ తెలుసుకునేందుకు థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించొచ్చు. ప్రతీ రౌటర్‌కు లిమిటేషన్ ఉంటుంది.
9. వైఫై కవరేజీని పెంచేందుకు రిపీటర్స్, ఎక్స్‌టెండర్స్ ఉపయోగించొచ్చు. మీ ఇంట్లో ఎక్కువ డెడ్‌జోన్స్ ఉన్నట్టైతే ఇవి ఉపయోగపడతాయి.

Latest News

 
మూడు నెలల్లో రెండు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే! Mon, Apr 29, 2024, 08:06 PM
టీడీపీకి భారీ ఊరట.. ఆ నియోజకవర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్ అభ్యర్థులు Mon, Apr 29, 2024, 08:02 PM
ఎన్నికల వేళ ఏపీవాసులకు రైల్వే గుడ్ న్యూస్.. ఇక నో టెన్షన్ Mon, Apr 29, 2024, 07:57 PM
ఓవైపు కూతురు.. మరోవైపు కొడుకు పోటీ.. మధ్యలో వైసీపీ లీడర్ Mon, Apr 29, 2024, 07:44 PM
వైసీపీలోకి పిఠాపురం వర్మ?.. క్లారిటీ వచ్చేసిందిగా Mon, Apr 29, 2024, 07:39 PM