ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు

by సూర్య | Wed, Mar 25, 2020, 02:41 PM

కరోనా నియంత్రణ చర్యల కోసం ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు జమ చేస్తామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.కరోనా నియంత్రణ చర్యల్లో ఉద్యోగులందరం పాల్గొంటున్నామని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులకు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నామని చెప్పారు.రవాణా సదుపాయాలు లేనందున ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలని కోరారు. రవాణా సదుపాయం ఉన్న ఉద్యోగులందరం సచివాలయానికి వచ్చి పని చేస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసే అవకాశాలను పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆర్డినెన్స్‌ ద్వారా బడ్జెట్‌ను ఆమోదించే అవకాశాలను పరిశీలించాలని వెంకట్రామిరెడ్డి సూచించారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM