బంగారం కొనాలనుకునేవారికి షాక్...

by సూర్య | Wed, Mar 25, 2020, 02:03 PM

బంగారం ధర పెరుగుతుందా, తగ్గుతుందా అన్నది అంచనాలకు అందట్లేదు. కొద్ది రోజుల క్రితం తగ్గుతున్నట్టు అనిపించిన గోల్డ్ రేట్ మళ్లీ పెరుగుతోంది. బంగారం ధర భారీగా పెరుగుతుండటం కొనుగోలుదారులకు షాక్ ఇస్తోంది. ముంబై బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,528 పెరిగింది. ప్రస్తుతం ముంబైలో 10 గ్రాముల 22 క్యారట్ బంగారం ధర రూ.38,698 కాగా, 24 క్యారట్ గోల్డ్ ధర రూ.42,247. ఇక 18 క్యారట్ గోల్డ్ ధర రూ.31,685. హైదరాబాద్‌లో కూడా గోల్డ్ రేట్ పెరుగుతోంది. 10 గ్రాములపై రూ.300 పైనే పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర రూ.43,620 కాగా, 24 క్యారట్ గోల్డ్ ధర రూ.40,073. బంగారం మాత్రమే కాదు... వెండి ధర కూడా దూసుకెళ్తోంది. కేజీ వెండి ధర రూ.40,000 దాటింది. ముంబై బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర ఏకంగా రూ.3,475 పెరిగి రూ.40,325 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.1,140 పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.41,020. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ భారీగా ట్రెజరీస్, సెక్యూరిటీస్ కొనాలని నిర్ణయించడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నట్టు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాంతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పతనం కావడం కూడా బంగారం, వెండి రేట్లు పెరగడానికి కారణమని భావిస్తున్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM