కొత్త తేదీలు మార్చి 31 తర్వాత ప్రకటిస్తాం: విద్యాశాఖ మంత్రి

by సూర్య | Wed, Mar 25, 2020, 12:22 PM

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. రెండు వారాలపాటు పరీక్షలు వాయిదా వేయనున్నట్టు ఆయన తెలిపారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి కొత్త తేదీలు ప్రకటిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం కరోనా కట్టడిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాపి నిరోధక చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

Latest News

 
ఆధారాలు లేని రూ. 50 లక్షలు నగదు స్వాధీనం Mon, Apr 29, 2024, 12:42 PM
పేలిన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ Mon, Apr 29, 2024, 12:40 PM
నేడు ధర్మవరంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రచారం Mon, Apr 29, 2024, 12:38 PM
జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...? Mon, Apr 29, 2024, 12:37 PM
నేడు చోడ‌వ‌రంలో సీఎం బహిరంగ సభ Mon, Apr 29, 2024, 12:36 PM