కరోనాకు చెక్ పెట్టేందుకు సీఎం కీలక నిర్ణయం

by సూర్య | Wed, Mar 25, 2020, 12:43 PM

కరోనా ప్రభావం పెరుగుతుండడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 48 గంటల్లోగా ఈ సర్వే పూర్తి కావాలన్నారు. గ్రామ వాలంటీర్లు,ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లతో ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు. ఈ సర్వేలో కుటుంబ సభ్యులందరి ఆరోగ్య వివరాలు నమోదు చేస్తారు. సర్వే ద్వారా వచ్చే డాటాను విశ్లేషించుకొని ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనుంది. కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆస్పత్రులలో చేరాలని సీఎం సూచించారు. ప్రజలంతా ఇళ్లలో ఉండి సర్వేకు సహకరించాలని ఆయన అన్నారు. లక్షణాలు ఉన్నవారు విధిగా హోం ఐసోలేషన్‌ పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఇప్పటి వరకు పాజిటివ్ గా తేలిన కేసులన్ని విదేశాల నుంచి వచ్చినవేనని, ఏపీలో ఉన్నవారికి అటువంటి ఇబ్బంది లేదన్నారు. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు,అది వ్యాపించకుండా ఉండేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. 48 గంటల్లోగా సర్వే పూర్తవ్వాలని ఆదేశించారు. సర్వే చేసే వారు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ కోరారు.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM