ట్రంప్ భార్యకు కరోనా పరీక్షలు

by సూర్య | Tue, Mar 24, 2020, 12:46 PM

అగ్రరాజ్యం అమెరికాను కూడా కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే అక్కడ పెద్ద స్థాయిలో మరణాలు సభవించాయి. వేలాది మందికి లక్షణాలు బయటపడ్డాయి. ఈ వైరస్ ఎవరికి సోకుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ భార్య, ఆ దేశ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో నెగటివ్‌ రావటంలో, ఆమెకు కరోనా సోకలేదని నిర్ధారణ  అయింది. 


వైరస్ దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ పరీక్షలు చేసినట్టుగా వైద్యులు చెప్పారు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించారు. అంతే కాకుండా ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌కు కూడా కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఆ దేశం అప్రమత్తమైంది అన్ని వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 99 మరణించడం విశేషం.

Latest News

 
మద్యం అక్రమ రవాణా బాగా పెరిగింది Tue, Apr 30, 2024, 05:51 PM
నేడు రెండు చోట్ల బాలకృష్ణ సభలు Tue, Apr 30, 2024, 05:50 PM
మైనింగ్ జరుపుకునే వెసులుబాటు కల్పించాలి Tue, Apr 30, 2024, 05:49 PM
వైసీపీ నేతలకు తెలిసింది రౌడీయిజమే Tue, Apr 30, 2024, 05:49 PM
వైసీపీ మేనిఫెస్టో మోసాల పుట్ట Tue, Apr 30, 2024, 05:48 PM