స్వీయ నిర్బంధంలో సంగక్కర

by సూర్య | Tue, Mar 24, 2020, 12:15 PM

తనకు తాను స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర తెలిపాడు. తమ ప్రభు త్వ ఆదేశానుసారం స్వచ్ఛందంగా ఇంటికే పరిమిత మయ్యామని సంగక్కర తెలిపాడు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ శ్రీలంకలోనూ అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సంగక్కర మాట్లాడుతూ తను ఇటీవల లండన్‌ నుంచి వచ్చి నట్టు తెలిపాడు. తనకు ఎలాంటి వైరస్‌ ప్రభావిత లక్షణా లు కని పించలేదని అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపా డు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని సంగక్కర కోరాడు.


రూ.25మిలియన్ల విరాళం


ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభానికి కారణమైన కోవిడ్‌ 19మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆయా దేశాల్లో క్రీడాసంస్థలు కూడా తమవంతు కృషిచేస్తున్నాయి. తాజాగా శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ) కోవిడ్‌ 19వైరస్‌ను ఎదుర్కొనేందుకు సోమవారం 25మిలియన్‌ల రూపాయలను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ గ్రాంటును వెంటనే తమ ప్రభుత్వానికి అందజేస్తామని ఎస్‌ఎల్‌సీ తెలిపింది. శ్రీలంక క్రికెట్‌ తమవంతుగా ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటుందని ఎస్‌ఎల్‌సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే తమ దేశీయ క్రికెట్‌ టోర్నమెంట్లు అన్నింటినీ తదుపరి నోటీసు వచ్చేవరకూ రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ సమయంలో ఫస్ట్‌క్లాస్‌ ఆటగాళ్లు, జాతీయ జట్టులోని ఆటగాళ్లందరూ ఇంటిలోనే ఉంటూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరింది. తమ ఆటగాళ్లు సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా కోవిడ్‌ 19కు వ్యతిరేకంగా పోరాటానికి నిరంతరం మద్దతు ఇస్తున్నారని, అభిమానులు సురక్షితంగా ఉండాలని అభ్యర్థిస్తున్నారని శ్రీలంక క్రికెట్‌ బోర్డు తెలిపింది. క్రికెట్‌ క్లబ్‌లు, సంఘాలు ఈ సమయంలో సురక్షితంగా ఉండేలా అన్నివిధాలా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్టు ఎస్‌ఎల్‌సీ తెలిపింది.కాగా శ్రీలంకలో ఇప్పటివరకు 90కేసులు నమోదయ్యాయి. అయితే ఎవరూ మరణించలేదు.


 


 

Latest News

 
ఘనంగా గోవిందరాజస్వామి గరుడ సేవ.. శ్రీవారి నుంచి భారీగా కానుకలు Mon, May 20, 2024, 10:01 PM
ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలకు ఇబ్బందులు.. అప్పటి నుంచి బంద్ Mon, May 20, 2024, 09:54 PM
తెలుగువారి కీర్తి విశ్వవ్యాప్తం.. గోపీచంద్ తోటకూర అంతరిక్ష యానం, సరికొత్త రికార్డ్ నమోదు Mon, May 20, 2024, 09:02 PM
అమలాపురంలో కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన మహిళ.. స్కాన్ చేసిన డాక్టర్లు షాక్, అరుదైన సర్జరీ! Mon, May 20, 2024, 08:58 PM
శ్రీశైలం వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆ టికెట్ రేట్లతో, ఏమైందంటే Mon, May 20, 2024, 08:55 PM