నేడు కోయిల్​ ఆళ్వార్​ తిరుమంజనం

by సూర్య | Tue, Mar 24, 2020, 08:44 AM

తిరుమల : కరోనా వైరస్​ వ్యాప్తిని నివారించడంలో భాగంగా ఈనెల 31వ తేదీ వరకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. స్థానికుల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు తిరుమల - తిరుపతి మధ్య కనుమ రహదారుల్లో వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు తెలిపారు. 


ముందస్తుగా ఆన్​లైన్​లో బుక్​ చేసుకున్న రూ.300 దర్శన టోకెన్లు, ఆర్జిత సేవలు, గదులను భక్తులు రద్దు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. మార్చి 25 నుంచి వారి బ్యాంకు ఖాతాల్లోకి రీఫండ్​ సొమ్ము చెల్లిస్తామని వెల్లడించారు. నేడు కోయిల్​ ఆళ్వార్​ తిరుమంజనం, రేపు ఉగాది ఆస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలోకి సిబ్బందిని పరిమితంగా అనుమతించాలని సూచించారు.శ్రీశార్వరి నామ ఉగాది సందర్భంగా బుధవారం తిరుమలలో ఉగాది ఆస్థానాన్ని తితిదే నిర్వహించనుంది. ఉదయం వేకువజామున 3 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ తర్వాత 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి వేశేష సమర్పణ చేస్తారు. 


ఉదయం 7 నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. మూల విరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు ఉగాది పంచాంగాన్ని పఠించనున్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM