కరోనా పై గూగుల్‌ కీలక నిర్ణయం..

by సూర్య | Mon, Mar 23, 2020, 12:57 PM

 కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌పై  అవగాహన కల్పించేందుకు తనదైన శైలిలో స్పందించింది.  వైరస్‌నుంచి కాపాడుకోవడానికి, రక్షణ చర్యలు తీసుకోవడానికి అవసమయ్యే సమాచారం కోసం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ టంప్‌ విలేకరుల సమావేశం నిర్వహించిన వారం తర్వాత గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కరోనా వైరస్‌ కోసం గూగుల్‌ ఒక స్క్రీనింగ్‌ వెబ్‌సైట్‌ తీసుకోవాలనీ, తద్వారా ఇది ప్రజలను నిర్దేశించాలని టంప్‌ పేర్కొన్న నేపథ్యంలో https://www.google.com/covid19/అనే వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. ఈ అవగాహన, నివారణ, స్థానిక వనరులపై ఈ వెబ్‌సైట్‌ దృష్టి కేంద్రీకరించింది.కోవిడ్‌ -19 సమాచారం రాష్ర్టాల ఆధారంగా, భ్రదత, నివారణ  మార్గాలతోపాటు , కోవిడ్‌  సంబంధ సెర్చ్‌, ఇతర సమాచారం లభిస్తుందని గూగుల్‌ తెలిపింది.  సెర్చ్‌  ఫలితాల్లో, గూగుల్‌ మ్యాప్స్‌లో నేరుగా కరోనా వైరస్‌ గురించి నమ్మదగిన సమాచారం అందేలా  చేస్తామని   సెర్చ్‌ దిగ్గజం తెలిపింది.

Latest News

 
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM
మూడు నెలల్లో రెండు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే! Mon, Apr 29, 2024, 08:06 PM
టీడీపీకి భారీ ఊరట.. ఆ నియోజకవర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్ అభ్యర్థులు Mon, Apr 29, 2024, 08:02 PM