'బిఎస్‌ఎన్‌ఎల్' వినియోగదారులకు శుభవార్త.. రోజుకి 5జీబీ ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ

by సూర్య | Sat, Mar 21, 2020, 05:57 PM

బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఓ క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది. కరోనా నేపథ్యంలో ఇప్పడు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరూ వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో ల్యాండ్ లైన్ కస్టమర్లందరికీ ఉచితంగా నెల రోజుల పాటు ఈ సేవలను అందించనుంది. కాగా.. ఎయిర్‌టెల్, జియో వంటి ప్రైవేట్ ప్రొవైడర్లు.. ఇతర ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లతో పోటీ పడటానికి ఈ ఆఫర్ సహాయపడుతుందని సంస్థ భావిస్తోంది. 'కరోనావైరస్'ని అరికట్టేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న వివిధ విధానాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి. దీన్ని ప్రోత్సహించడానికి బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్‌ని ప్రకటించినట్లు'.. బిఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సీఎఫ్‌ఏ వివేక్ బంజాల్ పేర్కొన్నారు.
బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఉన్న, బ్రాండ్ బ్యాండ్ లేని దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ ఈ సేవలను.. ఒక నెల రోజుల పాటు ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా ఈ ప్లాన్ ద్వారా 10 ఎంబీపీఎస్ఎస్ డౌన్ స్పీడ్‌ను, 5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ సంస్థ. ఒకవేళ డేటా పరిమితి అయిపోతే.. డేటా వేగం కోసం 1 ఎంబీపీఎస్‌కు పరిమితమవుతుంది. ఈ కొత్త ఆఫర్ ద్వారా ఇంటి నుండి పని చేసుకోవడానికి, ఆన్‌లైన్ క్లాసెస్ ద్వారా విద్యాభ్యాసం చేయడానికి ఉపయోగించవచ్చని బిఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సీఎఫ్‌ఏ వివేక్ బంజాల్ తెలిపారు.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM