సోలార్ కారు..కాలుష్యం పరార్.!

by సూర్య | Sat, Mar 21, 2020, 03:58 PM

నేటి రోజులలో వాతావరణ కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. వాహనాల పెరుగుదల వల్ల, అధిక ఇంధన వినియోగం వల్ల ప్రపంచం కాలుష్య కోరల్లోకి నెట్టబడుతోంది. దీని వల్ల చాలా మందికి అనారోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయి. ఇటువంటి సమస్యకు పరిష్కార మార్గంగా బాసరలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్న తరుణ్ రాజ్ ఓ వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ ను తయారు చేసి అందరి చేత ప్రశంసలు పొందుతున్నారు. తరుణ్ రాజ్ చేపట్టిన హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ కారు సోలార్ పవర్ తోనూ, ఎలక్ట్రిసిటీతోనూ నడుస్తుంది. ఈ కారును సుమారు 6 గంటల పాటు ఎండలో పెడితే 40 కిలోమీటర్ల వరకూ నడుస్తుంది. దీని వల్ల పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు. కాలుష్యం కూడా జరగదు. తరుణ్ రాజ్ చేసిన ఈ ప్రయోగాన్ని వరల్డ్ ఎడ్యుకేషన్ సబ్మిట్ లో కూడా ప్రదర్శించారు. తరుణ్ రాజ్ ప్రయోగానికి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియజేశారు. 40 కిలోమీటర్ల వేగంతో వెల్లే ఈ కారును రాబోవు రోజుల్లో వాడుకలోకి తీసుకురావాలన్నదే వారి లక్ష్యంగా చెప్పుకొచ్చారు. తరుణ్ రాజ్ ఇటువంటి ప్రయోగాలను మరెన్నో చేసి విజయం సాధించాలని లోకల్ ఆకాంక్షిస్తోంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM