ఇప్పుడు జనతా కర్ఫ్యూ.. అప్పట్లో శాస్త్రి వ్రతం

by సూర్య | Sat, Mar 21, 2020, 11:53 AM

దేశవ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలంటూ ప్రధాని మోదీ పిలుపినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపుతో చాలా మంది ఐదు దశాబ్ధాల క్రితం జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. అదేంటంటే అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఇలాంటి నినాదమే ఒకటి ఇచ్చారు. ప్రజలంతా ఒక రోజు ఉపవాసం చేయాలంటూ ఆయన ఇచ్చిన పిలుపుతో యావత్ దేశం దాన్ని పాటించింది. అయితే అప్పటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి వేరు అయినప్పటీకి ఈ రెండు దేశ ప్రజల సంఘటితంపై ఆధాపడి ఉండటం విశేషం.


1965లో ఇండో – పాక్ యుద్ధం భీకరంగా సాగింది. దానికి ఎప్పుడు తెరపడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అప్పటికే ప్రజలు తీవ్రమైన దారిద్య్రంలో ఉండేవారు. యుద్ధం కారణంగా వ్యవసాయ దిగుబడి తగ్గితే తిండికి మరింత ఇబ్బంది అవుతుందని ఆయన ముందే గుర్తించారు. సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రజలంతా వారానికి ఒక రోజు ఉపవాసం ఉండాలని పిలుపునిచ్చారు. ఒకపూట తిండి మానేస్తే ఆ మిగిలిన ఆహారపు గింజలు పేద వారికి సాయం చేయడం వల్ల ఆకలి వ్యథలు ఉండవని అభిప్రాయపడ్డారు.


ఆయన పిలుపుతో దేశమంతా సానుకూలంగా స్పందించింది. జనం ఈ పిలుపును ‘శాస్త్రి వ్రతం’గా ఆచరించారు

Latest News

 
ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే సోదరుడు ప్రచారం Wed, May 01, 2024, 04:53 PM
ప్రజా సేవా కార్యక్రమంలో శ్రీ వినాయక ఫౌండేషన్ Wed, May 01, 2024, 04:51 PM
ఆచార్యనాగార్జునయూనివర్సిటీ బి.ఎడ్ 4వసెమిస్టర్ పరీక్షలుమొదలు Wed, May 01, 2024, 04:49 PM
ఆశ్రమ పాఠశాలలో అన్నదానం నిర్వహించిన వైకాపా నాయకులు Wed, May 01, 2024, 04:48 PM
కందుకూరులో ఘనంగా మేడే వేడుకలు Wed, May 01, 2024, 04:46 PM