జనతా కర్ఫ్యూలో భాగంగా దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న రైళ్లు

by సూర్య | Sat, Mar 21, 2020, 12:13 PM

ఆదివారం దేశవ్యాప్తంగా ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు రైళ్లు నిలిచిపోనున్నాయి. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లు రెండు మూడింటిని అవసరాన్ని బట్టి నడిపించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ముందే ప్రయాణం ప్రారంభించిన దూరప్రాంత రైళ్లు మాత్రం యథావిధిగా గమ్యం వైపు వెళ్లనున్నాయి.
కానీ ఉదయం 7 నుంచి రాత్రి 9 మధ్య ప్రారంభమయ్యే మిగతా అన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ప్యాసింజర్‌ రైళ్లకు సంబంధించి 2,400 సర్వీసులు, దూర ప్రాంతాలకు తిరిగే రైళ్లకు సంబంధించి దాదాపు 1,300 సర్వీసులు నిలిచిపోనున్నాయి. నగరంలో తిరిగే 121 ఎంఎంటీఎస్‌ రైళ్లలో రెండు, మూడు మినహా మిగతావాటిని నిలిపేస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లోనూ రేపు మెట్రో రైలు సర్వీసులు నిలిచిపోన్నాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మెట్రో సర్వీసులు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఆర్టీసీ బస్సుల విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి తాము ఏ నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వం నుంచి ఆదేశం వస్తే శనివారం నిర్ణయిస్తామని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్‌ ప్రమాదం పొంచి ఉన్నా, జనజీవనానికి ఇబ్బంది లేకుండా రైళ్లు నడుపుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్‌ కార్యాలయాలు, సాధారణ బుకింగ్‌ కేంద్రాలు, ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్‌ల వద్ద, పార్శిల్‌ కార్యాలయాల వద్ద ఒకరికి ఒకరికి మధ్య మీటర్‌ దూరం ఉండేలా ఫ్లోర్‌పై మార్కింగ్‌ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లలో ఉన్న రిటైరింగ్‌ రూమ్స్, డార్మిటరీలను మూసేయాలని రైల్వే నిర్ణయించింది. శనివారం రాత్రి 12 నుంచి ఏప్రిల్‌ 15 రాత్రి 12 వరకు వీటిని మూసి ఉంచాలని నిర్ణయించింది.

Latest News

 
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM
అన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Wed, Apr 17, 2024, 09:27 PM
దంచికొడుతున్న ఎండలు.. గురువారం ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు Wed, Apr 17, 2024, 09:26 PM
ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల సంఘం ట్విస్ట్.. కీలక ఆదేశాలు, గీత దాటితే వేటు Wed, Apr 17, 2024, 09:22 PM
ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు Wed, Apr 17, 2024, 09:15 PM