మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ రాజీనామా

by సూర్య | Fri, Mar 20, 2020, 07:47 PM

మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న రాజకీయ హైడ్రామాకు తెరపడింది. ప్రస్తుత సీఎంగా ఉన్న కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కమల్ నాథ్ సర్కార్ బలపరీక్షను ఎదుర్కోక తప్పలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు కమల్ నాథ్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే బలపరీక్ష జరగడానికి కొద్ది గంటల ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ ను కలిసి కమల్ నాథ్ తన రాజీనామాను అందజేయనున్నారు. ఈ సందర్భంగా కమల్ నాథ్ మీడియాతో మాట్లాడారు.బెంగళూరులో తమ ఎమ్మెల్యేలను నిర్బంధంలో ఉంచారని కమల్ నాథ్ ఆరోపించారు. తన సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి బీజేపీ కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కమల్ నాథ్ రాజీనామాతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందనే చెప్పుకోవచ్చు.

Latest News

 
అత్తకు మద్దతుగా కోడలు ప్రచారం Mon, May 06, 2024, 03:05 PM
వైసీపీ పథకాలు అవినీతిమయం: అంబికా Mon, May 06, 2024, 03:01 PM
ఆత్మకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సునీత Mon, May 06, 2024, 02:59 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ ను గెలిపించుకుందాం Mon, May 06, 2024, 02:57 PM
ఎన్నికల ప్రచారంలో ప్రజల కష్టాలను పాలుపంచుకుంటున్న దాదిరెడ్డి Mon, May 06, 2024, 02:55 PM