కస్టమర్లకు జియో బంపర్ ఆఫర్

by సూర్య | Fri, Mar 20, 2020, 07:34 PM

భారతదేశ నంబర్ వన్ టెలికాం బ్రాండ్ జియో డేటా వోచర్లను సవరించింది. కానీ ప్రీపెయిడ్ ప్లాన్ల తరహాలో ఈ డేటా వోచర్ల ధరలను కాకుండా అందించే డేటాను డబుల్ చేసింది. టారిఫ్ లను పెంచడానికి ముందు జియో ఐయూసీ టాప్ అప్ లను తీసుకువచ్చింది. జియో 4జీ డేటా వోచర్లతో కూడా డబుల్ డేటా, ఉచిత ఐయూసీ నిమిషాలను అందించడం ప్రారంభించింది.


రూ.11 డేటా వోచర్!


ఈ రీచార్జ్ చేసుకుంటే 800 ఎంబీ డేటా, ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 75 నాన్ జియో నిమిషాలను అందిస్తారు.


రూ.21 డేటా వోచర్!


రీచార్జ్ చేసుకుంటే మీకు 2 జీబీ డేటా, ఏకంగా 200 నిమిషాల నాన్ జియో నిమిషాలు లభిస్తాయి. వ్యాలిడిటీ విషయానికి వస్తే... మీ ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉందో అంతవరకు దీని వ్యాలిడిటీ కూడా ఉంటుంది.


రూ.51 డేటా వోచర్!


డేటా వోచర్లు సవరించాక ఈ ప్లాన్ ద్వారా 6 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు జియో నుంచి నాన్ జియో నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 500 నిమిషాలను అందిస్తారు.


రూ.101 డేటా వోచర్!


ఈ రూ.101 డేటా వోచర్ ద్వారా గతంలో 6 జీబీ డేటా అందించేవారు. ఇప్పుడు సవరణ అనంతరం 12 జీబీ డేటా అందిస్తున్నారు. దీంతోపాటు జియో నుంచి నాన్ జియో నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 1,000 నిమిషాలను అందిస్తారు.


జియో రూ.251 డేటా వోచర్ ప్లాన్ కు ఎటువంటి మార్పులూ చేయలేదు. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 51 రోజులుగా ఉంది

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM