కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక దృష్టి...

by సూర్య | Fri, Mar 20, 2020, 07:37 PM

కరోనా రక్కసిని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాయి. వచ్చిన వారిలో ధైర్యం నింపేందుకు, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం అవలంభిస్తున్న విధానాలు అభినందనీయం. అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాయి.


1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రూ. 408 కోట్లను విడుదల చేసింది.


2. తెలంగాణ ప్రభుత్వం మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలను, మాల్స్ ను, పబ్ లను మూసివేయాలని ఆదేశించింది.


3. కర్ణాటక ప్రభుత్వం కూడా మార్చి నెలాఖరు వరకు అన్ని విద్యాసంస్థలు, పార్కులు, మాల్స్ లను మూసివేయాలని పేర్కొంది.


4. కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా ప్రసిద్ధ దేవాలయాలను మూసివేయాలని ఆదేశించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.


5. మహారాష్ట్రలో కేసులు నానాటికీ పెరిగిపోతుండడంతో 144 సెక్షన్ విధించారు.


6. కేసుల సంఖ్య పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసిన గుజరాత్ ప్రభుత్వం తక్షణ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.


7. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, బెంగాల్, ఒడిషా ప్రభుత్వాలు కూడా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.


వీటితో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించి వారిని ఇతరులకు దూరంగా ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM