ఐపీఎల్ 2020 షెడ్యూల్ ఖరారు...

by సూర్య | Sun, Feb 16, 2020, 06:29 PM

క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2020 షెడ్యూల్ ఖరారైంది. మార్చి 29న ముంబైలో ఈ పోటీలు ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, గత సంవత్సరపు రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ వాంఖడే స్టేడియంలో తలపడనున్నాయి. మే 17న ఆఖరి లీగ్ మ్యాచ్, మే 24న ఫైనల్ జరుగనున్నాయి. ఇక ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఒకే మ్యాచ్ జరిపేలా షెడ్యూల్ ను ఖరారు చేయడంతో, మ్యాచ్ లు జరిగే రోజుల సంఖ్య 44 నుంచి 50కి పెరిగింది. రాజస్థాన్ రాయల్స్ మినహా మిగతా ఫ్రాంచైజీలు తమ సొంత వేదికలను కొనసాగించాలనే నిర్ణయించుకోగా, రాజస్థాన్ మాత్రం గువాహటిలో రెండు మ్యాచ్ లను నిర్వహించాలని భావిస్తోంది. ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇక హైదరాబాద్ సన్ రైజర్స్ విషయానికి వస్తే, ఉప్పల్ లో తొలి మ్యాచ్ ని ఏప్రిల్ 1వ తేదీన ఆడనున్న జట్టు, ఆపై 12, 16, 26, 30, మే నెలలో 5, 12 తేదీల్లో మ్యాచ్ లను ఆడనుంది. ఇతర ఫ్రాంచైజీల సొంత వేదికలపై ఏప్రిల్ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో సన్ రైజర్స్ మ్యాచ్ లు జరుగుతాయి.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM