పోలవరం నిధులు వెంటనే ఇప్పించాలి: సీఎం జగన్

by సూర్య | Sun, Feb 16, 2020, 06:22 PM

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై హోంమంత్రికి నివేదించిన సీఎం విజ్ఞాపన పత్రంలోని అంశాలను ఆయనకు వివరించారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఇప్పటివరకూ రూ.838 కోట్లను ఆదా చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంతో సాగుతోందని సీఎం హోంమంత్రికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3,320 కోట్లను వెంటనే ఇప్పించాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాల, గ్రాంట్ల రూపేణా రాష్ట్రానికి కేవలం రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చిందని సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఒక ఏడాది విడుదల చేసిన రూ.22,000 కోట్లలో ఇది సగం మాత్రమేనని సీఎం పేర్కొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM