దాడులు జరిగితే లక్షల కోట్లు అక్రమాలు బయటకు వస్తాయి: వైసీపి మండ‌లి చీఫ్

by సూర్య | Sun, Feb 16, 2020, 05:26 PM

తాడేప‌ల్లిలో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో వైసీపి మండ‌లి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడారు. చిన్న ఉద్యోగి వద్దే రూ.2 వేల కోట్లు ఉంటే రాష్ట్రాన్ని చంద్రబాబు ఏవిధంగా పరిపాలించాడో అర్థం చేసుకోవచ్చన్నారు. గత ఐదేళ్లలో ఏపీలో జరిగిన అక్రమాలపై దేశమంతా కోడై కూసిందని.. ఇవాళ ఆ బండారం అంతా బయటపడిందని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. బయటపడిన అక్రమాలు చాలా తక్కువని ముఖ్యమైన వారిపై దాడులు జరిగితే లక్షల కోట్లు అక్రమాలు బయటకు వస్తాయన్నారు. ఓటుకు నోటు కేసు కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. వికేంద్రీకరణ బిల్లులపై ఆర్డినెన్స్ ఇవ్వాలా..? గవర్నర్ ఆమోదానికి పంపాలా..? అనేది ఆలోచన చేస్తామని ఉమ్మారెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్‌కు పంపలేదని చెప్పారు.వికేంద్రీకరణ బిల్లుల విషయంలో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభన ఇంకొన్ని రోజులు కొనసాగుతుందని చెప్పారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM