కశ్మీర్ వివాదం.. భారతీయులు గూగుల్‌పై ఆగ్రహం

by సూర్య | Sun, Feb 16, 2020, 05:19 PM

దారులు తెలుసుకోవడానికి అందరూ ఉపయోగించే గూగుల్ మ్యాప్స్‌.. కొన్ని ప్రాంతాలను అభ్యంతరకరమైన రీతిలో చూపిస్తోందంటూ ఓ అమెరికన్ పత్రిక వెల్లడించింది. దీనికి ఉదాహరణగా కశ్మీర్ మ్యాప్‌ను చూపిస్తోంది. భారతదేశంలోని వాళ్లు గూగుల్ మ్యాప్స్‌లో చూస్తే జమ్మూకశ్మీర్ మొత్తం భారత్‌లో భాగంగానే కనిపిస్తోంది. కానీ ఇతర దేశాల్లో వారికి మాత్రం మరో మ్యాప్ కనిపిస్తోంది. దానిలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను సన్నని చుక్కల గీతతో గూగుల్ చూపిస్తోంది. అంటే ఈ ప్రాంతాన్ని వివాదాస్పద ప్రాంతంగా గుర్తించినట్లే. ఈ విషయం తెలుసుకున్న భారతీయులు గూగుల్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన గూగుల్ ప్రతినిధి.. 'మేము మ్యాప్స్ విషయంలో పక్షపాత వైఖరి ప్రదర్శించం. ఆయా దేశాల చట్టాలు, అధికారిక సమాచారం మేరకే మ్యాప్స్‌లో మార్పులు చేస్తాం. వారిచ్చిన డేటా ప్రకారమే ఆయా ప్రాంతాల్లో మ్యాప్స్‌ చూపిస్తాం. 2014లో తెలంగాణ రాష్ట్రం విషయంలో కూడా ఇదే చేశాం' అని చెప్పారు. అలాగే గూగుల్ నిబంధనల ప్రకారం వివాదాస్పద ప్రాంతాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు అందజేయాలని, దాని కోసమే ఇలా సన్నని చుక్కల గీతతో ఆయా ప్రాంతాలను చూపించడం జరుగుతోందని వెల్లడించారు.

Latest News

 
నేడు హిందూపురంలో పర్యటించనున్న సీఎం జగన్ Sat, May 04, 2024, 10:45 AM
సినిమా స్క్రిప్టు ప్రసంగాలకు జనం నవ్వుకుంటున్నారు Sat, May 04, 2024, 10:45 AM
వాలంటీర్స్ ద్వారా పెన్షన్ ఇవ్వొద్దని టీడీపీనేతలు చెప్పింది నిజం కాదా..? Sat, May 04, 2024, 10:44 AM
వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు కావాలనే తప్పించారు Sat, May 04, 2024, 10:42 AM
సాధ్యం కాని హామీలు ఇవ్వడంలో చంద్రబాబు దిట్ట Sat, May 04, 2024, 10:41 AM