వేల పాములు పట్టినా.. ప్రాణాపాయ స్థితిలో..

by సూర్య | Sun, Feb 16, 2020, 05:14 PM

పాములను అలవోకగా పడుతూ వాటిని పట్టడమే జీవన బృథిగా మార్చుకున్న పాముల సురేష్ అదే పాము కాటుకు గురై ప్రాణాలతో పోరాడుతున్నాడు.చిన్న వయసు నుంచే పాములను పట్టడంలో నేర్పరిగా అయిన సురేశ్, పాము కాటు తో ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.జనావాసాల్లోకి పాము వచ్చిందని తెలియగానే వెళ్లి, దాన్ని అదుపు చేసే సురేశ్ ను గతంలో ఎన్నో మార్లు పాములు కాటేశాయి.
కేరళను వరదలు ముంచెత్తిన సమయంలో వందలాది సర్పాలను సురేశ్ పట్టుకున్నాడు. తాజాగా, అత్యంత విషపూరితమైన రక్త పింజరి, సురేశ్ ను కాటేసింది. డాక్టర్లు అతనికి యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇచ్చినా, అది పని చేయలేదు. ఇప్పటికే పలు మార్లు యాంటీ వీనమ్ ఇంజక్షన్లను అతను చేయించుకుని ఉండటమే ఇందుకు కారణం. అతని శరీరంలోకి ఎక్కిన యాంటీ వీనమ్ ఔషధం, రక్తపిజరి కాటుతో వెళ్లిన విషాన్ని అదుపు చేయడంలో విఫలమైంది. దీంతో మరో మూడు రోజులు గడిస్తేగాని సురేశ్ పరిస్థితిపై ఓ అవగాహనకు రాలేమని వైద్యులు స్పష్టం చేశారు.

Latest News

 
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ అద్భుత అవకాశం.. సొంతంగా సేవ చేసే ఛాన్స్ Sun, May 05, 2024, 07:43 PM
ఏపీలో ప్రచారానికి వెళ్లొచ్చి చెబుతున్నా.. ఎంత మెజార్టీ వస్తుందంటే: గెటప్ శ్రీను Sun, May 05, 2024, 07:40 PM
విజేతను తేల్చే జిల్లా ఇది.. ఇక్కడ గెలిస్తే వార్ వన్ సైడే. Sun, May 05, 2024, 07:36 PM
అంబటికి అల్లుడికి షాక్.. మా మామ నీచుడంటూ వీడియో.. అసలు నిజమిదేనంటున్న వైసీపీ Sun, May 05, 2024, 07:33 PM
పోలింగ్ ముందు బిగ్ ట్విస్ట్.. ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు Sun, May 05, 2024, 07:27 PM