కరోనాపై ఘన విజయం సాధించిన కేరళ వైద్యులు

by సూర్య | Sun, Feb 16, 2020, 04:55 PM

చైనాలోని వుహాన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న ముగ్గురు కేరళ విద్యార్ధినులకు కరోనా వైరస్ సోకగా వారు ముగ్గురూ చైనా నుంచి భారత్‌కు తిరిగి రాగానే ప్రత్యేక వార్డులకు తరలించి కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ స్వీయ పర్యవేక్షణలో వైద్యం జరిగింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌కి గురైన ముగ్గురు రోగులు పూర్తిగా కోలుకున్నట్టు వైద్య పరీక్షల్లో తేలడంతో కేరళలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ముగ్గురూ పూర్తిగా కోలుకున్న నేపథ్యంలో ఇవాళ కేరళ ఆరోగ్యమంత్రి థామస్ ఐజక్ ట్విటర్లో స్పందిస్తూ నిపా కేసులో మాదిరిగానే, కరోనా వైరస్‌పై పోరాటంలో కేరళ విజయం సాధించిందని, కరోనా బారిన పడిన ముగ్గురూ పూర్తిగా కోలుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్థారించారని ప్రకటించారు. క్వారంటైన్‌ పరిశీలనలో వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వస్తోందని చెబుతూ ఈ సందర్భంగా ఆరోగ్య శాఖకు అభినందనలు అని ఆయన పేర్కొన్నారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM