ప్రైవేట్ కాలేజీల పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ వినతి

by సూర్య | Sat, Feb 15, 2020, 08:00 PM

రాష్ట్రంలో ఇంటర్ బోర్డ్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల కాకుండానే కార్పొరేట్ కళాశాలలు అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. ప్రధానంగా శ్రీచైతన్య, నారయణ విద్యాసంస్థలు ఇప్పటికే 50 శాతం అడ్మిషన్లు పూర్తి చేశారు. డిసెంబర్, జనవరి లో చేరితే ప్రత్యేక ఫ్యాకేజీ రాయితీలు ఇస్తూ ప్రవేశాలు చేస్తున్నారు. వారి పట్ల ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారు. ప్రతి పల్లెలు, పట్టణాల్లో పి.ఆర్.వోల ద్వారా ప్రవేశాలు చేస్తూ వారికి ఈ నెలలో చేరితేనే రాయితీలు ఇస్తామని చెప్పి అడ్మిషన్స్ తీసుకుంటున్నా.. రాష్ట్ర ఇంటర్ అధికారులు ఏమాత్రం స్పందించటం లేదని వెంటనే కమిషనర్ జోక్యం చేసుకోని అక్రమంగా అడ్మిషన్లు తీసుకుంటున్నా కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సరైన క్యాంపస్ లు లేకుండా విద్యా సంవత్సరంలో ఇంటర్ బోర్డు అనుమతి, అప్లికేషన్ పొందకుండానే ప్రవేశాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పదవ తరగతి పరీక్షలు పూర్తికాకుండనే మోసపూరితంగా కార్పొరేట్ కళాశాలలు అక్రమాలకు పాల్పడుతున్నారు. అడ్మిషన్లు కోసం వచ్చే పి.ఆర్.వో లను తల్లిదండ్రులు తరమాలని కోరారు. కమిషనర్ పేషిలో అధికారికి వినతిపత్రం అందించారు. వినతిపత్రం అందించిన వారిలో ఎస్.ఏఫ్.ఐ.రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు, ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు, హైదరాబాద్ నగర అధ్యక్ష్య, కార్యదర్శులు అశోక్, జావేద్ పాల్గొన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM