రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన జార్ఖండ్ మంత్రి

by సూర్య | Sat, Feb 15, 2020, 07:45 PM

జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి బన్నా గుప్తా రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో ఆయన తనిఖీ చేస్తున్న సందర్భంగా ఆసుపత్రిలో గత ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న ఒక వృద్ధ మహిళకు అవసరమైన రక్తం అందుబాటులో లేకపోవడంతో ఆమెకు చికిత్స అందించేందుకు ఇబ్బంది ఏర్పడింది. ఆమె భర్త ఈ విషయాన్ని మంత్రికి తెలియజేశాడు. వెంటనే స్పందించిన మంత్రి రక్త దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో వైద్య సిబ్బంది మంత్రి నుంచి రక్తం సేకరించి ఆ వృద్ధురాలికి చికిత్స అందించారు. ఈ సందర్భంగా రిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి స్వయంగా రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM