టీడీపీపై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు

by సూర్య | Sat, Feb 15, 2020, 08:14 PM

చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మనీల్యాండరింగ్ చేయడంలో దిట్ట అని ఆరోపించారు. ''చంద్రబాబు, లోకేష్, టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వల్లే మోదీకి దూరమైపోయారు. రైల్వే కాంట్రాక్టర్లను బెదిరించి మరీ టీడీపీ నేతలు కమీషన్లు వసూలు చేశారు. బీజేపీని ఓడించేందుకు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి డబ్బు పంపించారు.. అయినా టీడీపీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. పవన్‌కు నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు అక్రమాలను ప్రశ్నించాలి. మాజీ ముఖ్యమంత్రి పీఎస్ దగ్గర 2 వేల కోట్లు దొరకడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. సాక్ష్యాలతో సహా చంద్రబాబు, లోకేష్ దొరికిపోయారు. వారి పాస్ పోర్టులు సీజ్ చేయాలి. కేంద్ర హోంమంత్రి ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీలతో లోతైన దర్యాప్తు చేయాలి''. అని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
''పొత్తుల విషయంలో పార్టీ పరమైన, విధాన పరమైన నిర్ణయాలు పార్టీ అధినేత తీసుకుంటారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఫెడరల్ విధానంలో రాజకీయాలు వేరు... ప్రభుత్వ విధానాలు వేరు. బీజేపీతో మాకేమీ శత్రుత్వం లేదు. అమరావతిని తరలిస్తున్నామని మేం చెప్పలేదు. మూడు రాజధానులను మాత్రమే ఏర్పాటు చేస్తున్నాం. విశాఖ, అమరావతి, కర్నూలులోనే రాజధానులను పెడుతున్నాం.. కానీ ఒడిషాలో పెట్టడం లేదు కదా?, పేదలకు ఇళ్ల పట్టాలిచ్చేందుకే భూ సేకరణ. 6 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కోసం తీసుకుని అభివృద్ధి చేస్తాం. సోమవారం నాటికి పింఛన్ల రీ సర్వే పూర్తి చేస్తాం. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛన్లు అందిస్తాం. స్థానిక సంస్థల సమయంలో కావాలనే కొందరు ఉద్యోగస్తులను రెచ్చగొడుతున్నారు'', అని మంత్రి వ్యాఖ్యానించారు.

Latest News

 
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM
ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన.. జడ్జి ముందు చంద్రబాబు ప్రమాణం Tue, Apr 23, 2024, 09:00 PM
ఏపీ ఎన్నికల ప్రచారంలో ట్విస్ట్.. చంద్రబాబుపై చర్యలకు ఈసీకి సిఫార్సు Tue, Apr 23, 2024, 08:55 PM