ఇక 'ఆన్ లైన్' లో మద్యం అమ్మకాలు!

by సూర్య | Sat, Feb 15, 2020, 02:28 PM

ప్రస్తుతం ఏ వస్తువు కావాలన్నా ఆన్ లైన్ లో బుక్ చేస్తే క్షణాల్లో ఇంటికి వచ్చేస్తుంది. వేసుకునే బట్టల నుంచి తినే తిండి వరకు అంతా ఆన్ లైన్ మహిమ అయిపోయింది. ఇంట్లోనే కూర్చొని క్షణాల్లో కావాల్సింది తెప్పించుకోవచ్చు. ఈ కామర్స్ బిజినెస్ వేగంగా వృద్ది చెందడంతో ఈ సేవలన్ని అందుబాటులోకి వచ్చాయి. అయితే త్వరలోనే మద్యం వ్యాపారాన్ని కూడా ఆన్ లైన్ చేసేందుకు లిక్కర్ ఇండస్ట్రీ కసరత్తు చేస్తోంది. త్వరలోనే మద్యం వ్యాపారాన్ని ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అమ్రిత్ కిరణ్ సింగ్ తెలిపారు. కర్ణాటకలో ఇప్పటికే ఈ వ్యాపారం ఉందన్నారు.
మద్యం ఆన్ లైన్ అయితే ప్రమాదం తప్పదని మరికొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం ఆన్ లైన్ విధానానికి అంగీకరించపోవచ్చని అమ్రిత్ అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవానికి అన్ని ప్రభుత్వాలకు కూడా మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలు చేస్తే ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుందని లిక్కర్ ఇండస్ట్రీ నిపుణులు తెలిపారు. లిక్కర్ ఇండస్ట్రీ చేసే ఈ ప్రయత్నాలు సఫలమవుతాయో లేక విఫలమవుతాయో చూడాలి. మద్యం ఆన్ లైన్ విధానంతో చెడు జరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వాలు ఒప్పుకోవన్న చర్చ జరుగుతోంది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM