ప్రియురాలితో లవర్స్ డే.. ఎదురొచ్చిన భార్య

by సూర్య | Sat, Feb 15, 2020, 02:40 PM

ప్రియురాలితో కలిసి వాలంటైన్స్ డే సందర్భంగా ఓ వ్యక్తి షాపింగ్ మాల్ కు వెళ్లాడు. అదే షాపింగ్ మాల్ కు అతని భార్య రావడంతో అడ్డంగా బుక్కయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బీహార్ కు చెందిన రాజేష్ కు మూడు సంవత్సరాల క్రితం పెళ్లైంది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారి కాపురం అన్యోన్యంగానే సాగిపోతుంది. కానీ అనూహ్యంగా రాజేష్ కు మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఇంట్లో తెలియకుండా గుట్టుగా తన బంధాన్ని కొనసాగిస్తున్నాడు. శుక్రవారం వాలంటైన్స్ డే సందర్భంగా షాపింగ్ మాల్ కు ప్రియురాలితో కలిసి రాజేష్ వెళ్లాడు. అక్కడ దుస్తులు కొని,ఐస్ క్రీంలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు.
సరిగ్గా అదే సమయానికి రాజేష్ భార్య ఆ షాపింగ్ మాల్ కు వచ్చింది. రాజేష్,ప్రియురాలు ఆమెకు ఎదురొచ్చారు. వీరు ఇద్దరు కలిసి ఉండడం చూసి నిలదీసింది. భర్త చెంప చెల్లుమనిపించి ఎడాపడా తిట్టేసింది. షాపింగ్ మాల్ లో అందరి ముందే రాజేష్ దుమ్ము దులిపింది. దీంతో రాజేష్ బిత్తరపోయాడు. వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసిన ప్రియురాలిని విడిచి వెళ్లలేకపోయాడు. ఆ యువతిని కూడా రాజేష్ భార్య చితకబాదింది. ఈ ఘటనతో రాజేష్ తలదించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించి తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Latest News

 
ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు మాట్లాడ్డం తగదు Tue, May 07, 2024, 07:09 PM
స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేకపోవడం దారుణం Tue, May 07, 2024, 07:08 PM
ఇంగ్లీష్ మీడియం తీసుకురాను అని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా? Tue, May 07, 2024, 07:07 PM
ప్రజలకు మేలు జరిగితే సహించలేని వ్యక్తి చంద్రబాబు Tue, May 07, 2024, 07:06 PM
సీఎం జగన్ పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు Tue, May 07, 2024, 07:05 PM