పావని కుమారికి రజతం!

by సూర్య | Sat, Feb 15, 2020, 02:26 PM

ఆసియా యూత్, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ వెయిట్‌లిఫ్టర్‌ కె.వి.ఎల్‌. పావని కుమారి రెండు రజత పతకాలు సాధించింది. 45 కేజీల విభాగంలో పోటీపడిన విశాఖపట్నం జిల్లా లిఫ్టర్‌ పావని యూత్, జూనియర్‌ కేటగిరీల్లో మొత్తం 145 కేజీలు (స్నాచ్‌లో 66+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 79) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం పావని హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌ (టీఎస్‌ఎస్‌ఎస్‌)లో కోచ్‌ మాణిక్యాల రావు వద్ద శిక్షణ తీసుకుంటోంది. 45 కేజీల విభాగంలోనే భారత్‌కే చెందిన హర్షద గరుడ్‌ యూత్, జూనియర్‌ కేటగిరీల్లో రెండు కాంస్య పతకాలు సాధించింది. హర్షద మొత్తం (స్నాచ్‌లో 62+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 77) 139 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో మొత్తం 20 దేశాల నుంచి 197 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM