రంజీ క్రికెట్‌ కామెంట్రీపై అభిమానుల ఆగ్రహం

by సూర్య | Fri, Feb 14, 2020, 01:43 PM

కర్ణాటక X బరోడా జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఇద్దరు వ్యాఖ్యాతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో దుమారం రేపుతున్నాయి. క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ హిందీలో కామెంట్రీ చేసే విధానాన్ని గుర్తు చేసుకున్న క్రమంలో ఒక వ్యాఖ్యాత స్పందిస్తూ.. ‘ప్రతీ భారతీయుడికి హిందీ రావాలి. అదే మన మాతృ భాష. ఇంతకన్నా పెద్ద భాష ఉండదు’ అని పేర్కొన్నాడు. అందుకు తగ్గట్టే మరొక వ్యాఖ్యాత మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే నేను కూడా కోపంగా ఉండేవాళ్లను చాలా మందిని చూస్తుంటాను. వాళ్లేమంటారంటే.. మనం క్రికెటర్లమైనా హిందీ మాట్లాడాలా? అని అడుగుతారు. భారత దేశంలో ఉన్నామంటే కచ్చితంగా హిందీలోనే మాట్లాడతాం. అదే మన మాతృ భాష’ అని మరింత ఘాటుగా వ్యాఖ్యానించారు. వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. పలువురు అభిమానులు ఆ వ్యాఖ్యాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పేదాన్ని బట్టి ప్రతీ భారతీయుడికి హిందీ వచ్చి తీరాలా? ఈ భూమి మీద మీరు ఎవరని అనుకుంటున్నారు?బీసీసీఐ తప్పుడు సందేశాలను ఇవ్వొద్దు. ప్రతీ భారతీయుడికీ హిందీ రావాల్సిన అవసరం లేదు’ అంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు. మరికొందరైతే తమ మాతృభాష కన్నడ అని. తాము కన్నడలోనే మాట్లాడతామని ట్వీట్‌ చేశారు.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM