ఓ చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్న జస్‌ప్రీత్ బుమ్రా !

by సూర్య | Tue, Feb 11, 2020, 05:59 PM

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మూడు వన్డేల సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఎన్నడూ లేని విధంగా పరుగులు సమర్పించుకున్న ఈ యార్కర్ల్ కింగ్.. ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయకుండా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తొలి వన్డేలో 10 ఓవర్లు వేసి 53 పరుగులిచ్చిన బుమ్రా ఇందులో 13 వైడ్లు వేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. రెండో వన్డేలో 10 ఓవర్లకు 64 పరుగులిచ్చి వికెట్ పడగొట్టకుండా నిరాశపరిచాడు. మూడో వన్డేలో కూడా 10 ఓవర్లకు 50 పరుగులే ఇచ్చి కట్టడి చేసినా ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఈ సిరీస్ అతని యావరేజ్‌ ఇంపాక్ట్ 11.6 కాగా... అతనికిది ఏ సిరీస్‌లోనైనా ఇదే అత్యంత చెత్త యావరేజ్ కావడం గమనార్హం. ఇక చివరిగా ఆడిన ఆరు వన్డేల్లో కలిపి బుమ్రా కేవలం ఒకే ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. వరుసగా నాలుగు వన్డేల్లో వికెట్ పడగొట్టలేకపోయాడు. ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జరిగిన చివరి వన్డేలో 10 ఓవర్లు వేసిన బుమ్రా 38 పరుగులిచ్చాడు. గత ఏడాది చివర్లో వెన్ను గాయంతో మూడు నెలలు క్రికెట్‌కి దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా.. జనవరిలో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ.. పునరాగమనంలో బుమ్రా బౌలింగ్‌లో మునుపటి పదును కనిపించడం లేదు. ముఖ్యంగా.. డెత్ ఓవర్లలో గతంలోలా యార్కర్లని సంధించడంలో ఈ అగ్రశ్రేణి పేసర్ విఫలమవుతున్నాడు

Latest News

 
ఘనంగా గోవిందరాజస్వామి గరుడ సేవ.. శ్రీవారి నుంచి భారీగా కానుకలు Mon, May 20, 2024, 10:01 PM
ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలకు ఇబ్బందులు.. అప్పటి నుంచి బంద్ Mon, May 20, 2024, 09:54 PM
తెలుగువారి కీర్తి విశ్వవ్యాప్తం.. గోపీచంద్ తోటకూర అంతరిక్ష యానం, సరికొత్త రికార్డ్ నమోదు Mon, May 20, 2024, 09:02 PM
అమలాపురంలో కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన మహిళ.. స్కాన్ చేసిన డాక్టర్లు షాక్, అరుదైన సర్జరీ! Mon, May 20, 2024, 08:58 PM
శ్రీశైలం వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆ టికెట్ రేట్లతో, ఏమైందంటే Mon, May 20, 2024, 08:55 PM