వన్డేల్లో అరుదైన రికార్డు సాధించిన అయ్యర్‌ !

by సూర్య | Tue, Feb 11, 2020, 05:03 PM

 అయ్యర్‌ వన్డేల్లో ఓ అరుదైన రికార్డును సాధించాడు. 10 కన్నా ఎక్కువ మ్యాచ్‌లలో అత్యధిక హాఫ్‌ సెంచరీల సగటు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 16 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్‌ 9 అర్ధ సెంచరీలు చేశాడు. ఫలితంగా అత్యధిక హాఫ్‌ సెంచరీల సగటు 56.25 సగటు నమోదు చేశాడు. తర్వాతి స్థానాల్లో ఇయాన్‌ చాపెల్‌ 16 మ్యాచ్‌లలో 8, ఆకిబ్ ఇలియాస్ 10 మ్యాచ్‌లలో 5 హాఫ్‌ సెంచరీలు (సగటు 50)తో ఉన్నారు. అన్షుమన్‌ రథ్‌ 18/8 -సగటు 44.44, డేర్‌ డస్సన్‌ 16/7 -సగటు 43.75, టెన్‌ డోషెట్‌ 32/14 -సగటు 43.75 మిగతా స్థానాల్లో ఉన్నారు. అయితే రాహుల్ రాణించినా.. శ్రేయస్, పాండే మెరుపులు మెరిపించినా.. కొండంత లక్ష్యం ప్రత్యర్థి ముందు ఉంచినా ఫలితం లేకపోయింది. గప్టిల్, నికోలస్ ధాటికి పేసర్లు చేతులెత్తేసినా.. చాహల్ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌పై ఆశలు రేకెత్తించినా.. కడవరకు గ్రాండ్ హోమ్ అజేయంగా నిలబడటంతో భారత్ ఓటమిపాలైంది. ఫలితంగా 31 ఏళ్ల తర్వాత 3-0తో క్లీన్‌స్వీప్‌కు గురై చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. 1989 తర్వాత మూడు అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లున్న వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయిన జట్టుగా కోహ్లీసేన అప్రతిష్టను మూటగట్టుకోనుంది. టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌కు గురైన న్యూజిలాండ్ అంతకంతకు బదులు తీర్చుకుంది. 

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM