కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపిన ఏపీ సీఎం జగన్

by సూర్య | Tue, Feb 11, 2020, 04:44 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. ఆప్ పార్టీని పోటీకి దిగిన ఆయన అత్యధిక స్థానాల్లో గెలుపు సాధించి మరోసారి ఢిల్లీ పీఠాన్ని చేజెక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కేజ్రీవాల్‌కు ఆయన విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి జగన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మీ ఐదేళ్ల పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆశిస్తున్నానంటూ జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఢిల్లీలో మరోసారి చీపురు ఉడ్చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీని సైతం పరుగులు పెట్టించి దేశ రాజధానిలో తన సత్తా చాటింది. సరిలేరు నాకెవ్వరూ అంటూ... అరవింద్ కేజ్రీవాల్.... ఢిల్లీ పీఠాన్ని మరోసారి చేజెక్కించుకున్నారు.ఢిల్లీ ఔర్ ఏక్ బార్ ...కేజ్రీవాల్‌ సర్కార్ ఇప్పుడు ఇదే మాట నిజమైంది. దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తున్నా... కూడా ఢిల్లీ మాత్రం ఆయన పీఠం చెక్కు చెదరలేదు. ముచ్చటగా మూడోసారి కూడా ఢిల్లీ కా రాజా నేనే అంటూ సత్తా చాటారు అరవింద్ కేజ్రీవాల్. దేశ రాజధానిలో తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని సత్తా చాటారు. సరిలేరు నాకెవ్వరూ అంటూ... పోరాడి నిలబడ్డారు. చీపురు గుర్తుతో చిన్న పార్టీ పెట్టిన కేజ్రీ అతితక్కువ కాలంలోనే దేశ రాజకీయాల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌ముఖ రాజ‌కీయ నాయకుడే కాదు... సామాజిక‌ ఉద్య‌మ‌కారుడు కూడా. హ‌ర్యానాలోని ఒక మారుమూల గ్రామంలో జ‌న్మించాడు. చిన్న‌నాటి నుంచే చ‌దువుల్లో చురుగ్గా ఉండే ఆయ‌న‌, ఐఐటీ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఉత్తీర్ణులై, ఖ‌ర‌గ్‌పూర్ ఐఐటీలో మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో చేరారు. డిగ్రీ పూర్త‌యిన వెంట‌నే ఆయ‌నకు టాటా స్టీల్‌లో ఉద్యోగం ల‌భించింది. అందులో ఇమ‌డ‌లేక సివిల్స్ రాసేందుకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1993 లో సివిల్ స‌ర్వీసు ప‌రీక్ష‌ల్లో పాస్ అయిన కేజ్రీవాల్ ఇండియ‌న్ రెవెన్యూ సర్వీసెస్‌లో చేరారు. 1995 లో త‌న తోటి ఐఆర్ఎస్ అధికారిని అయిన సునీత‌ను పెళ్లి చేసుకున్నారు. కాళీఘాట్‌లోని మ‌ద‌ర్ థెరెసా ఆశ్ర‌మంలో ఆయ‌న రెండు నెల‌ల పాటు సేవ చేసే అవ‌కాశం కూడా ద‌క్కించుకున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM