ఏపీ రాజధాని అంశంలో మరో సంచలన ట్విస్ట్..

by సూర్య | Tue, Feb 11, 2020, 05:16 PM

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ రెండు బిల్లులను మండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపుతామని ప్రకటించినప్పటికీ.. ఆ దిశగా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ క్రమంలో ఏపీ రాజధాని బిల్లులపై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులకు ఆమోదం లభించినట్లేనని ఆయన బాంబు పేల్చారు. 14 రోజులు ముగిసినందున ఆ రెండు బిల్లులు పాసైనట్లేనని అన్నారు. విచక్షణాధికారాన్ని ఎక్కడపడితే అక్కడ ఉపయోగించడం కుదరదని మండలి ఛైర్మన్‌పై విమర్శలు గుప్పించారు పిల్లి సుభాష్.
బిల్లుల విషయంలో మూడు ఆప్షన్లే ఉంటాయయని ఆయన స్పష్టం చేశారు. బిల్లు పాస్ చేయాలి, లేదంటే బిల్లు తిరస్కరించాలి. లేదంటే సెలెక్ట్ కమిటీకి పంపాలి. వీటిలో రెండు, మూడు ఆప్షన్లు లేనందున.. ఫస్ట్ ఆప్షనే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు పాసైనట్లేనని తేల్చిచెప్పారు పిల్లి సుభాష్. ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తామని చెప్పుకొచ్చారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM