ఢిల్లీ ఎన్నికల ఎఫెక్ట్.. 2024లో మోదీ VS కేజ్రీవాల్?

by సూర్య | Tue, Feb 11, 2020, 12:30 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచాలనకు అనుగుణంగా అమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీతో ఢీకొని ఆప్ చీఫ్ అరవింద్ క్రేజీవాల్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అప్పుడే ఢిల్లీలో పోస్టర్లు దర్శనం ఇస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొనే సత్తా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఉందని ఆప్ కార్యకర్తలు అప్పుడే పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు. అయితే 2024 లోక్ సభ ఎన్నికల్లో ఏం జరుగుతుందో ? చెప్పడం ఇప్పుడే సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం ఉదయం ప్రారంభం అయిన తరువాత ఢిల్లీలోని అమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం దగ్గర ఆ పార్టీ కార్యకర్తలు సందడి చేస్తున్నారు. మంగళవారం ఆప్ కార్యకర్తలు అసలు కథ 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో మొదలౌతుందని ఓ పోస్టర్స్ చేత పట్టుకున్నారు.
2024 లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాన పోటీ ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఉంటుందని ఆప్ కార్యకర్తలు పోస్టర్స్ చేత పట్టుకున్నారు. ఆ రోజు అసలు కథలో హీరో ఎవరో తేలిపోతుందని ఆప్ కార్యకర్తలు అంటున్నారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించాలని అమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేశాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కు అన్నీ తానై ముందుండి నడిపించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ స్థాయి నాయకులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా స్థానిక సమస్యలు, జాతీయ సమస్యల విషయంపైనే ఎక్కువగా అన్ని పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 70 అసెంబ్లీ సీట్లు ఉన్న ఢిల్లీని మరోసారి కైవసం చేసుకోవాలని ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి గట్టి పోటీ ఇస్తూ ప్రచారం చేశారు.
2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పోటాపోటీగా ప్రచారం చేశారు. తరువాత ఢిల్లీలో 54 శాతం ఓట్లు సాధించిన అమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ కేవలం 3 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇప్పుడు మరోసారి ఢిల్లీలో అధికారంలోకి రావడానికి అరవింద్ కేజ్రీవాల్ సిద్దం అయ్యారు. ఇదే సమయంలో 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి పోటీగా అమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉంటారని ఆప్ కార్యకర్తలు పోస్టర్లు ప్రదర్శించడంతో బీజేపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు.

Latest News

 
వాలంటీర్లు కలిసికట్టుగా పనిచేసి వైసిపి గెలుపుకు కృషి చేయాలి Tue, May 07, 2024, 12:50 PM
పోస్టల్ బ్యాలెట్ సెంటర్ ను తనిఖీ చేసిన ఆర్డిఓ Tue, May 07, 2024, 12:40 PM
వింజమూరులో పర్యటించిన మేకపాటి కుమారులు Tue, May 07, 2024, 12:08 PM
యధావిధిగా డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష Tue, May 07, 2024, 12:07 PM
శ్రీనివాసపురంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం Tue, May 07, 2024, 11:55 AM