వామ్మో జగన్ అంటోన్న ఐఏఎస్ లు..!

by సూర్య | Tue, Feb 11, 2020, 12:20 PM

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి మూడు నెలలు కూడా కాలేదు... కానీ, అప్పుడే, ప్రెజర్ తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని నీలం సహానీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా నవంబర్ 17న బాధ్యతలు స్వీకరించిన నీలం సహానీ... జగన్ ప్రభుత్వ తీరుతో అడ్జస్ట్ కాలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. అందుకే, ధీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకుని, ఆ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నట్టు చెబుతున్నారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అయిన నీలం సహానీకి 2020 జూన్ 30వరకు పదవీ కాలముంది. నీల సహానీ, ఏపీ సీఎస్ గా రాకముందు సెంట్రల్ సర్వీసుల్లో ఉంటూ... కేంద్ర సామాజిక న్యాయశాఖ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. అయితే, అప్పటివరకు ఏపీ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్వీ సుబ్రమణ్యాన్ని అనూహ్యంగా అవమానకరరీతిలో సాగనంపిన జగన్ ప్రభుత్వం.... నీలం సహానీని కేంద్ర సర్వీసుల నుంచి ప్రత్యేకంగా పిలిపించిమరీ సీఎస్ గా అవకాశమిచ్చింది.
అయితే, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో నీలం సహానీ అడ్జస్ట్ కాలేకపోతున్నారని, ముఖ్యంగా జగన్ ప్రభుత్వం తీరు, తీసుకుంటోన్న నిర్ణయాలతో నీలం సహానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. మూడు రాజధానుల కేసుల్లో కార్యాలయాలను తరలించొద్దని హైకోర్టు ఆదేశించినా, న్యాయస్థానం ఉత్తర్వులను లెక్కచేయకుండా ప్రభుత్వం జీవోలు జారీ చేయడం లాంటివి... సీఎస్ నీలం సహానీని చిక్కుల్లోకి నెట్టేశాయని చెబుతున్నారు. ఒకవైపు కోర్టుల ఆదేశాలు పాటించాల్సిన పరిస్థితి.... మరోవైపు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిన ఒత్తిడి... ఇలా, న్యాయస్థానాలు... ప్రభుత్వం మధ్య నలిగిపోతున్న నీలం సహానీ.... ప్రెజర్ తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
అప్పుడు ఎల్వీ సుబ్రమణ్యం అయినా... ఇప్పుడు నీలం సహానీ అయినా... జగన్ ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. పేరుకే ప్రభుత్వ యంత్రాంగానికి చీఫ్ సెక్రటరీ పెద్దయినా... మొత్తం సీఎంవో చెప్పినట్లే నడుస్తోందని అంటున్నారు. ముఖ్యంగా సీఎంవోలోని ఒక అధికారి ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోందంటున్నారు. అతని కారణంగానే, ఎల్వీ సుబ్రమణ్యాన్ని సాగనంపగా... ఇప్పుడు నీలం సహానీది దాదాపు అదే పరిస్థితి అంటున్నారు. జూనియరైన ఆ అధికారి చెప్పినట్లే మొత్తం నడుస్తోందని, అందుకే... దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM