సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల పర్యటన

by సూర్య | Fri, Jan 24, 2020, 07:58 PM

ఏపీ సీఎం జగన్ మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్దమయ్యారు. ఇది దాదాపు రచ్చబండ తరహాలోనే ఉండనుంది. ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను, లబ్దిదారుల ఎంపికను అధికారులు నిర్వహిస్తున్నారు. దీని పై సీఎం జగన్ శుక్రవారం మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, అధికారులతో సమీక్ష నిర్వహించారు.


ఫిబ్రవరి 1 నుంచి సీఎం జగన్ గ్రామాలలో నేరుగా పర్యటించాలని నిర్ణయించారు. పథకాలు అమలు తీరు, అందుతున్న తీరు పై ప్రజలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. అదే విధంగా ఇళ్ల స్థలాల ఎంపికకు సంబంధించి కూడా పరిశీలించనున్నారు. సీఎం జగన్ గ్రామాల పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Latest News

 
జనసేన పార్టీ అభ్యర్థుల్ని ఓడిస్తా.. ఆ విషయంలో పవన్ కంటే జగన్ బెటర్: మహాసేన రాజేష్ Tue, May 07, 2024, 09:46 PM
పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నేచురల్ స్టార్ నాని Tue, May 07, 2024, 09:09 PM
ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై ఓటరు ఫోటో బదులు క్యూఆర్ కోడ్ Tue, May 07, 2024, 09:02 PM
ఏపీలో దంచికొట్టిన వాన.. రేపు ఈ జిల్లాలలో భారీవర్షాలు.. అక్కడ పిడుగులు పడే ఛాన్స్ Tue, May 07, 2024, 08:58 PM
రాయలసీమలో ట్రెండ్‌ సెట్ చేసే ఏకైక జిల్లా అనంతపురం.. బరిలో ఉన్న అభ్యర్థులు వీరే Tue, May 07, 2024, 08:32 PM