రోహిత్ వికెట్ కోల్పోయిన భారత్!

by సూర్య | Fri, Jan 17, 2020, 03:06 PM

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. రాజ్‌కోట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫింట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫలితంగా టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసిన రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్ స్థానంలో మనీష్ పాండే, నవదీప్ సైనీలకు తుది జట్టులో చోటు కల్పించారు. ఈ మ్యాచ్‌ తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో మనీష్ పాండే 2018 తర్వాత భారత్ తరుపున వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. రాజ్‌కోట్ వన్డేలో రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఆసీస్ స్పిన్నర్ జంపా బౌలింగ్‌లో రోహిత్ ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. 44 బంతుల్లో ఆరు ఫోర్లతో రోహిత్ 42 రన్స్ చేశాడు. డ్రింక్స్ బ్రేక్స్ సమయానికి ఇండియా వికెట్ నష్టానికి 87 రన్స్ చేసింది. ధావన్ 38, కోహ్లీ 8 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. తొలుత ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM