రేపు ఢిల్లీకి జగన్.. మోడీ, షాలతో భేటీ..?

by సూర్య | Fri, Jan 17, 2020, 01:54 PM

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. రేపు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ దక్కినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రధానితో భేటీ తర్వాత హోంమంత్రి అమిత్ షాతో కూడ జగన్ సమావేశం అయ్యే అవకాశాలున్నాయి. రేపు మొత్తం సీఎం జగన్ ఢిల్లీలోనే గడపనున్నట్లు ఏపీ సీఎంవో వర్గాల నుంచి సమాచారం అందుతోంది. గత కొంత కాలంగా ప్రధాని మోడీ సహా హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ముఖ్యమంత్రి జగన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. రెండుసార్లు ఢిల్లీ వెళ్లిన జగన్ ఎవర్నీ కలవకుండానే ఏపీకి తిరిగి వచ్చారు.


మూడు రాజధానులపై ఏపీలో ఆందోళనలు జరుగుతున్న వేళ ప్రధాని, హోం మంత్రిలతో జగన్ సమావేశం కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 20న మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును ఆసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇటువంటి తరుణంలో రాజధాని మార్పుపై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు సీఎం జగన్ కు ఎలాంటి డైరక్షన్స్ ఇస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM