సీఎం జగన్‌తో ముగిసిన హైపవర్‌ కమిటీ భేటీ

by సూర్య | Fri, Jan 17, 2020, 01:51 PM

సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో హైపవర్‌ కమిటీ భేటీ ముగిసింది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్‌ కమిటీ శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యింది.  ఈ సందర్భంగా జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలపై.. హైపవర్‌ కమిటీ సభ్యులు సీఎం వైఎస్‌ జగన్‌కు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. భేటీ  అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రైతుల అంశంపైనా సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించినట్టు తెలిపారు. కమిటీ రిపోర్ట్‌లోని అంశాలను కూడా సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సమగ్ర ప్రణాళికలతో రాష్ట్ర అభివృద్ధిపై ప్రజల మనోభావాల మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ప్రాంతీయ అసమానతలపై దృష్టి సారించినట్టు వివరించారు.  


అమరావతి రైతులకు మరింత లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచనలు చేశారని బొత్స వెల్లడించారు. కమిటీ రిపోర్ట్‌ను కేబినెట్‌ ముందు ఉంచుతామని తెలిపారు. కేబినెట్‌ భేటీలో అన్ని విషయాలను సీఎంకు చెబుతామని అన్నారు. అన్నివర్గాలు బాగుపడాలన్నదే తమ తాపత్రయమని చెప్పారు. మూడు రోజుల అసెబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తామని స్పష్టం చేశారు. అమరావతి రైతులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాయలో పడొద్దని సూచించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM