సీఎస్‌తో అమెరికా కాన్సులేట్ జనరల్ భేటీ

by సూర్య | Thu, Jan 16, 2020, 05:37 PM

 అమెరికా కాన్సులేట్ జనరల్ జోల్ రీఫ్‌మెన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్‌కుమార్‌తో సచివాలయంలో భేటీ అయ్యారు. తెలంగాణ, అమెరికా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల విషయమై ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చింది.కాగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నిర్మాణం కావాల్సి ఉన్న అమెరికా వీసా కార్యాలయం విషయమై కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకంగా జరిగింది మాత్రమేనని సచివాలయ వర్గాలు వెల్లడించాయి.సోమేష్‌కుమార్ కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇక జోల్ రీఫ్‌మెన్ కూడా ఇటీవలే హైదరాబాద్ కాన్సులేట్ జనరల్‌గా నియమితులయ్యారు.


 


 

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM