రోజు కూలీకి ఐటీ శాఖ షాక్.. కోటి జరిమానా..!

by సూర్య | Thu, Jan 16, 2020, 05:13 PM

రోజు కూలీపని చేసుకునే ఓ వ్యక్తికి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు షాక్ ఇచ్చారు. కోటి రూపాయాల జరిమానా కట్టాలని నోటీసులు ఇచ్చారు. రోజంతా కష్టపడితేగానీ 300రూపాయాలు రాని ఆ వ్యక్తికి కోటి రూపాయాలను సొమ్మును కట్టాలని నోటిసులు అందడంతో లబోదిబోమంటున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే ముంబైలోని అంబివలి బస్తీలో బాబు సాహెబ్ అనే వ్యక్తి రోజు దినసరి కూలీగా జీవితం గడుపుతున్నాడు. అతడు రోజంతా కష్టపడితే 300 రూపాయాలు సంపాదిస్తాడు. అతడికి ఉన్న పళంగా ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చాయి. ఆ నోటీసులో కోటి రూపాయాల సొమ్మును ఫైన్ తో కట్టాలని ఉంది.


దీంతో భయపడిన పోయిన సాహెబ్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి చ్చింది. 2016 నోట్ల రద్దు సమయంలో బాబు సాహెబ్ అకౌంట్లో 58లక్షలు డిపాజిట్ అయినట్లు వెల్లడైంది. ఈ విషయం తనకు తెలియదని బాబు సాహెబ్ పోలీసులకు మొరపెట్టుకున్నాడు. దీంతో పోలీసులు ఐటీ ఆఫీస్ తో పాటు బ్యాంకుకు వెళ్లి కనుక్కుంటే బాబు సహెబ్ పాన్ కార్డు మీద వేరే వ్యక్తి ఫోటో, ఫోర్జరీ సంతకాలతో అకౌంట్ ఓపెన్ అయినట్లు తేలింది.

Latest News

 
షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు Fri, May 03, 2024, 03:24 PM
దువ్వూరు మండలంలో పలువురు వైసీపీలో చేరిక Fri, May 03, 2024, 03:20 PM
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 03:18 PM
షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు Fri, May 03, 2024, 02:50 PM
మోసపూరిత మాటలు నమ్మవద్దు: ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము Fri, May 03, 2024, 02:46 PM