ఏపీ రాజకీయాల్లో ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం : జీవీఎల్

by సూర్య | Thu, Jan 16, 2020, 05:08 PM

ఏపీ రాజకీయాల్లో  ఈరోజు ఒక  చారిత్రాత్మక నిర్ణయం  జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు.  రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయటంలో ఇది ఒక శుభ పరిణామం అని ఆయన అన్నారు.  విజయవాడలో  బీజేపీ, జనసేనకు చెందిన ప్రధాన నేతలు చర్చలు జరిపిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


గత 7 నెలల కాలంలో టీడీపీ వైసీపీ లు .... మోడీ గారికి, బీజేపీ కి మేము దగ్గరంటే మేము దగ్గర అని చెప్పుకుంటున్నారని...వారితో బీజేపీకి ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవని కేవలం జనసేన తో మాత్రమే కలిసి పని చేయటానికి ముందుకు వచ్చామని జీవీఎల్ చెప్పారు.


వచ్చే నాలుగున్నరేళ్లలో ప్రజాసమస్యలపై బీజేపీ జనసేన కూటమి ప్రజాసమస్యలపై ఉద్యమాలు చేసి ఏపీ రాజకీయాల్లో  ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగుతామని చెప్పారు.  ఈ కూటమి  రాబోయే రోజుల్లో ఏపీలో అనేక అద్భుతాలను సృష్టిస్తామని చెప్పారు. భారతీయ జనతాపార్టీ  అనేక రాష్ట్రాల్లో.. కేవలం నాలుగైదేళ్లలోనే  1, 2, శాతం ఓటింగ్ నుంచి ఎదిగి అధికారం అందుకుందని చెప్పారు. ఏపీలో కూడా 2024లో అధికారం అందుకుంటామని ఆయన ఆశాబావం వ్యక్తం చేశారు.  కుల రాజకీయాలకు అతీతంగా అభివృధ్దే లక్ష్యంగా తమ కూటమి పనిచేసి అద్భుత రాజకీయ ఫలితాలు సృష్టిస్తామని ఆయన అన్నారు


 


 


 

Latest News

 
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM
లోకం మాధవి ఆస్తుల విలువ తెలిస్తే షాకె Sat, Apr 20, 2024, 02:08 PM
అనకాపల్లి జిల్లాలో భారీగా వైసీపీలోకి చేరికలు Sat, Apr 20, 2024, 02:05 PM